Harish Rao : రెండు చీరలు కాదు.. ఒక్క చీర కూడా బంద్ పెట్టారు.. హరీశ్ ఫైర్

Update: 2024-10-17 09:45 GMT

ఈ ఏడాది దసరా పండుగ తెలంగాణ ఆడబిడ్డలను నిరూత్సాహ పరిచిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ భవన్‌లో మీడియా ప్రతినిధులతో హరీష్ రావు చిట్‌చాట్ నిర్వహించారు. ఉన్న పథకాలు బంద్ పెట్టడమే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మార్పు అని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఒక చీర కాదు.. బతుకమ్మ పండుగకు రెండు చీరలు ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారన్నారు. బతుకమ్మ రోజు ఒక్క చీర కాదు కదా… ఉన్న చీర కూడా బంద్ పెట్టారని ఎద్దేవా చేశారు. దసరా పండుగ వేళ అక్కా, చెల్లెళ్ళను‌ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు.

Tags:    

Similar News