తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ను విచారంచగా.. నేడు కేసీఆర్ ను కూడా విచారించారు సిట్ అధికారులు. అయితే కేసీఆర్ ను విచారిస్తున్నంతసేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి. తెలంగాణ భవన్ వద్ద పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకుని ఆందోళన నిర్వహించారు. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు అందరి అనుమానం ఒక్కటే. సిట్ తర్వాత ఏం చేయబోతోంది. ఈ కేసులో విచారణలు ఇంకా కొనసాగిస్తారా లేదంటే ఇక్కడితో ఆపేస్తారా అనేదే అతిపెద్ద ప్రశ్న. వాస్తవానికి సీఎంగా పనిచేసిన కేసీఆర్ ను విచారించినప్పుడే.. అంతిమ విచారణ అన్నట్టు ప్రచారం జరిగంది.
ఎందుకంటే బీఆర్ ఎస ప్రభుత్వంలో కేసీఆర్ ను మించిన స్థాయి ఎవరికీ లేదు. కాబట్టి సిట్ ఇప్పుడు ఏం చేయబోతోంది. నిజానిజాలు తేలేస్తారా లేదంటే మరింత లోతుగా విచారణ ఏమైనా సాగిస్తారా అనేది చూడాలి. కానీ యావత్ తెలంగాణను షాక్ కు గురి చేసిన ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజానిజాలు ఎంత త్వరగా తేలిస్తేనే అంత బెటర్. ఎందుకంటే ప్రజల్లో, అటు రాజకీయ వర్గాల్లో నెలకొన్న అనేక ప్రశ్నలకు సిట్ అధికారులు సమాధానం చెప్పి తీరాల్సిందే. వాళ్ల అనుమానాలను నివృత్తి చేయాల్సిందే.