Harish Rao: ప్రశాంత్‌ కిషోర్‌ సేవలపై స్పందించిన మంత్రి హరీష్‌రావు..

Harish Rao: హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో టీఆర్‌ఎస్‌ ప్లీనరీ ప్రారంభమైంది.

Update: 2022-04-27 06:45 GMT

Harish Rao: హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో టీఆర్‌ఎస్‌ ప్లీనరీ ప్రారంభమైంది. ఈ ప్లీనరీలో 11 తీర్మానాలు ప్రవేశపెట్టబోతున్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్ష, జాతీయ ప్రత్యామ్నాయ వేదిక లేదా కొత్త పార్టీ, కేంద్ర వైఫల్యాలపై మూడు రాజకీయ తీర్మానాలు చేయబోతున్నారు. వీటితో పాటు టీఆర్ఎస్‌ అభివృద్ధి, సంక్షేమం, దళిత బంధు, పురస్కారాలు వంటి అంశాలపై తీర్మానాలుంటాయి. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ మూడోసారి అఖండ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టేలా ప్లీనరీలో వ్యూహరచన చేస్తామన్నారు పార్టీ నేతలు.

ప్లీనరీకి హాజరమైన మంత్రి హరీష్‌రావు.. ప్రశాంత్‌ కిషోర్‌ సేవలపై స్పందించారు. ఎన్నికల్లో విజయం కోసం వ్యూహకర్తల సహకారం తీసుకున్నా.. ప్రభుత్వ పనితీరుతోనే ప్రజలు ఆదరిస్తారన్నారు. వ్యూహకర్తలను ఇతర పార్టీలు పెట్టుకుంటే ఒప్పు, తాము నియమించుకుంటే తప్పా అని విరుచుకుపడ్డారు. టీఆర్‌ఎస్‌కు ప్రశాంత్ కిషోర్ సహకారంపై కాంగ్రెస్‌, బీజేపీలకు మాట్లాడే అర్హత లేదన్నారు హరీష్‌రావు.

Tags:    

Similar News