అన్నట్టుగానే రాజీనామా పత్రంతో అమరవీరుల స్తూపం వద్దకు చేరుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు. దీంతో అక్కడి ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సీఎం రేవంత్ ఒట్లు నిజమైతే ఇక్కడికి రావాలన్నారు. హైదరాబాద్ లోని తన నివాసం నుంచి అమరుల స్తూపం వద్దకు చేరుకున్నారు. హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రజలను మోసగించిందని హరీశ్‌రావు ఆరోపించారు. బాండు పేపర్లు, సోనియా పేరిట లేఖ ఇచ్చి మాట తప్పారని మండిపడ్దారు.
బాండ్ల కాలం చెల్లిందని సీఎం దేవుడిపై ప్రమాణాలు చేస్తున్నారని హరీశ్‌రావు ఫైరయ్యారు. తనకు ఎమ్మెల్యే పదవి కంటే ప్రజలకు మేలు జరిగితే మంచిదన్నారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ, 6 గ్యారంటీలు అమలు చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఆరు గ్యారెంటీలో ఐదు గ్యారంటీలు అమలు చేశామని కాంగ్రెస్ చెప్పడం బోగస్ అని విమర్శించారు. అమరవీరుల స్తూపం వద్దకు వచ్చి సీఎం రేవంత్ రెడ్డి కూడా వచ్చి తన చిత్తశుద్ధి చాటుకోవాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.