అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ సంచలనం రేపింది. రోడ్లమీద, బయటనే కాదు శాసన సభలోనూ డ్రంకెన్ డ్రైవ్ పెట్టాలి అని హరీష్ రావు డిమాండ్ చేశారు. సభలో కొంతమంది సభ్యులు పొద్దున్నే తాగి సభకు వస్తున్నారని హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. హరీష్ రావు వ్యాఖ్యలపై అన్ని పార్టీల ఎమ్మెల్యేలు భగ్గుమన్నారు. హరీష్ రావు వ్యాఖ్యలకు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కౌంటరిచ్చారు. హరీష్ రావు ప్రతిపక్ష నాయకుణ్ణి ఉద్దేశించి మాట్లాడారనీ.. ఆయన తాగి సభకు రాకుండా ఫాం హౌస్ లో పడుకున్నాడనీ పంచ్ విసిరారు. బాత్ రూమ్ లో కూడా అలానే పడ్డాడేమో అని వెటకారంగా చెప్పారు.