Harish Rao (File Photo)
నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ డిపాజిట్లు గల్లంతయ్యాయని.. రేపు దుబ్బాకలోనూ అదే జరగబోతోందన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో ఆయన టీఆర్‌ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత తరపున ప్రచారం నిర్వహించారు. మంత్రి హరీష్ సమక్షంలో.. బీజేపీ మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు బాల్ లక్ష్మి, దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ బీజేపీ గ్రామశాఖ అధ్యక్షుడు సురేష్.. మరో 200 మందితో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరారు. 200 రూపాయల పెన్షన్‌ను.. 2 వేలకు పెంచిన ఘనత కేసీఆర్‌దే అన్న హరీష్.. కేంద్రం నుంచే పెన్షన్ ఇస్తున్నామని బీజేపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. పప్పులో చిటికెడు ఉప్పు వేసి.. పప్పు మొత్తం తామే చేశామన్నట్లుగా బీజేపీ కథ ఉందని ఎద్దేవా చేశారు.