HC: నేడు స్థానిక ఎన్నికలపై హైకోర్టులో విచారణ

కొనసాగుతున్న ఉత్కంఠ

Update: 2025-11-25 04:00 GMT

స్థా­నిక సం­స్థల ఎన్ని­క­ల­పై సోమవారం హై­కో­ర్టు­లో జరి­గా­ల్సిన వి­చా­రణ వా­యి­దా పడిం­ది. చీఫ్ జస్టి­స్ సె­ల­వు­లో ఉం­డ­టం­తో వా­యి­దా వే­యా­ల్సి వచ్చిం­ది. నేడు హైకోర్టులో వి­చా­రణ జరి­గే అవ­కా­శం ఉంది. ప్ర­భు­త్వం, ఎల­క్ష­న్ కమి­ష­న్ ఇప్ప­టి­కే ఎన్ని­క­ల­కు సి­ద్ధ­మ­ని కో­ర్టు­కు తె­లి­పా­యి. సో­మ­వా­రం తీ­ర్పు వస్తే నేటి కే­బి­నె­ట్‌ భే­టీ­లో ని­ర్ణ­యం తీ­సు­కో­వా­ల­ని ప్ర­భు­త్వం భా­విం­చి­నా.. , వి­చా­రణ వా­యి­దా­తో సస్పె­న్స్ కొ­న­సా­గు­తోం­ది. హై­కో­ర్టు ని­ర్ణ­యం వె­లు­వ­రి­స్తే ఆ ని­ర్ణ­యం ఆధా­రం­గా నేడు జర­గ­బో­యే కే­బి­నె­ట్ భే­టీ­లో ఎన్ని­క­ల­పై డి­సి­ష­న్ తీ­సు­కో­వా­ల­ని ప్ర­భు­త్వం భా­విం­చిం­ది. అనూ­హ్యం­గా హై­కో­ర్టు­లో వి­చా­రణ వా­యి­దా పడిం­ది. దీం­తో నేడు హై­కో­ర్టు వి­చా­రణ జరి­పి­తే ఎలాం­టి ని­ర్ణ­యం వె­లు­వ­రిం­చ­బో­తోం­ది? కే­బి­నె­ట్ భే­టీ­లో ప్ర­భు­త్వం ఎలాం­టి వ్యూ­హం­తో ఉం­ద­నే సస్పె­న్స్ కం­టి­న్యూ అవ­బో­తోం­ది. మరో­వై­పు గ్రా­మా­ల్లో స్థా­నిక ఎన్ని­కల సమ­రం­తో రా­జ­కీయ వా­తా­వ­ణం వె­డె­క్కిం­ది. ఇప్ప­టి­కే రి­జ­ర్వే­ష­న్ల ప్ర­క్రియ కూడా పూ­ర్త­యిం­ది.

ఈ కేసులో ఇప్పటికే ప్రభుత్వం, ఎన్నికల సంఘంఎన్నికలకు సిద్దంగా ఉన్నామని హైకోర్టుకు వివరించాయి.హైకోర్టు నిర్ణయం వెలువడిన పిదప మంగళవారం జరుగాల్సిన తెలంగాణ కేబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. హైకోర్టు విచారణ వాయదా పడటంతో కోర్టు నిర్ణయం వెలువడిన పిదపనే కేబినెట్ భేటీ కానున్నట్లుగా సమాచారం. స్థానిక ఎన్నికలకు సంబంధించి గత విచారణ సందర్భంగా హైకోర్టు సూచించిన మేరకు పాత రిజర్వేషన్ల మేరకు ప్రభుత్వం ఎన్నికలకు సిద్దమైంది. సర్పంచ్ లు, వార్డు సభ్యుల రిజర్వేషన్లను సైతం వెలువరించింది. రిజర్వేషన్లను గెజిట్ చేసి ఎన్నికల సంఘానికి పంపించేందుకు కావాల్సిన కసరత్తు పూర్తి చేసింది.

Tags:    

Similar News