HCA President : హెచ్‌సీఏ ప్రెసిడెంట్ సస్పెన్షన్.. అపెక్స్ కౌన్సిల్ సంచలన నిర్ణయం

Update: 2025-08-01 09:15 GMT

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషనలో నెలకొన్న గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో HCA అపెక్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావుతో పాటు కార్యదర్శి దేవరాజు, కోశాధికారి సీజే శ్రీనివాస రావు పై సస్పెన్షన్ వేటు వేసింది. సమగ్రత, పారదర్శకత, జవాబుదారీ తనం వంటి అత్యున్నత ప్రమాణాలకు HCA కట్టుబడి ఉంటుందని అపెక్స్ కౌన్సిల్ పేర్కొంది.

కాగా ఆర్థిక అవకతవకలు, నిధుల దుర్వినియోగం, ఫోర్జరీ ఆరోపణలతో HCA అధ్యక్షుడు జగన్మోహన్ రావు తో పాటు ఆయనకు సహకరించిన పలువురు పై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. దాదాపు 2.3 కోట్ల మేర నిధులు దుర్వినియోగం అయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో సీఐడీ, ఈడీ అధికారులు తమ విచారణను ముమ్మరం చేశారు. కాగా ఇలాంటి సమయంలో అపెక్స్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం కీలకంగా మారింది.

ఇక ఈ సస్పెన్షన్‌ తక్షణమే అమల్లోకి వస్తుందని, తదుపరి విచారణ పూర్తయ్యే వరకు జగన్మోహన్‌రావు హెచ్‌సీఏ కార్యకలాపాల్లో పాల్గొనరాదని ఆదేశించింది అపెక్స్ కౌన్సిల్. కాగా HCA వైస్ ప్రెసిడెంట్ దల్జీత్ సింగ్ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఇక ఈ వ్యవహారం తెలంగాణ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News