TG Government Clarification : HCU భూముల వివాదం ఇప్పటిది కాదు.. హిస్టరీ, సర్కారు క్లారిటీ ఇదే!

Update: 2025-04-01 10:15 GMT

"రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వివాదంపై తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీజీఐఐసీ) ప్రకటన విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలి గ్రామం సర్వే నంబర్ 25లోని 400 ఎకరాల భూమిని 2004, జనవరి 13వ తేదీన నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడా వసతుల అభివృ ద్దికి ఐఎంజీ అకడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ కు కేటాయించింది. ఐఎంజీ అకడమీస్ తన ప్రాజెక్టును ప్రారంభించకపోవడంతో నిబంధనలు ఉల్లంఘన జరిగిందని భావించి 2006, నవంబరు 21 నాటి రాష్ట్ర ప్రభుత్వం ఆ కేటాయింపును రద్దు చేసి ఏపీ యూత్ అడ్వాన్స్ మెంట్, టూరిజం అండ్ కల్చరల్ డిపార్టుమెంట్ కు కేటాయించింది. ఈ భూమి కేటాయింపులపై ఐఎంజీ అకడమీస్ హైకోర్టులో 2006లో రిట్ పిటిషన్ నంబర్ దాఖలు చేసింది. ఈ న్యాయ పోరాటం సుదీర్ఘ కాలం కొనసాగింది" అని సర్కారు తెలిపింది.

Tags:    

Similar News