కొందరు కరోనా వచ్చిన బయట తిరుగుతున్నారు : డీహెచ్ శ్రీనివాసరావు
తెలంగాణలో కరోనా అదుపులో ఉందన్నారు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు. భారత్ సహా 135 దేశాల్లో డెల్టా వేరియంట్ తీవ్ర ప్రభావం చూపిందన్నారు.;
తెలంగాణలో కరోనా అదుపులో ఉందన్నారు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు. భారత్ సహా 135 దేశాల్లో డెల్టా వేరియంట్ తీవ్ర ప్రభావం చూపిందన్నారు. కేరళలోనే 50 శాతం డెల్టా కేసులన్నాయన్నారు. శరీరంపై ఎక్కువకాలం డెల్టా వైరస్ ప్రభావం చూపుతోందన్నారు డీహెచ్. కోవిడ్ సెకండ్ వేవ్ పూర్తిగా పోలేదన్నారు. ఇలాగే కోనసాగితే థర్డ వేవ్‌కు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరించారు. పాజిటివ్ వచ్చిన వారు ఐసోలేషన్‌లో ఉండకుండా ఇష్టారీతిన బయట తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9 జిల్లాల్లో కేసులు ఎక్కువగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఫస్ట్ డోస్ కోటి 12 లక్షల మందికి ఇచ్చామన్న డీహెచ్.. ఇప్పుడు సెకండ్ డోస్ వారికి ఇస్తున్నామన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే.. మాల్స్, సినిమా హల్స్‌లోకి ఎంట్రీ ఉండే అవకాశాలు ఉన్నట్లు శ్రీనివాసరావు పేర్కొన్నారు.