హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తుండటంతో అధికారులను సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షాలపై నిత్యం అలర్ట్‌గా ఉండాలని, రోడ్లపై నీరు నిలవకుండా, ట్రాఫిక్, విద్యుత్ అంతరాయాలు లేకుండా GHMC, పోలీస్, హైడ్రా విభాగాలు రంగంలోకి దిగాలని చెప్పారు.
హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో GHMC కమిషనర్ విజయలక్ష్మి జోనల్ కమిషనర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఏవైనా వర్ష సంబంధిత సమస్యలు ఉంటే సాయం కోసం 040-21111111 నంబర్‌ను సంప్రదించాలని సిటిజన్లకు సూచించారు. ఇప్పటికే నీరు నిలిచిన ప్రాంతాలను క్లియర్ చేసినట్లు తెలిపారు.