తెలంగాణలో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో కుండపోత వర్షం పడుతుందని హెచ్చరించింది. కొన్ని చోట్ల 10 సెంటీ మీటర్ల అతి భారీ వర్షం కురుస్తుందని తెలిపింది. బంగళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి, ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురుస్తాయంటోంది. ముఖ్యంగా కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయంటోంది. ఈ క్రమంలోనే ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.