హెచ్చరిక.. హైదరాబాద్‌లో మరో మూడు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు!

Update: 2020-09-17 12:57 GMT

హైదరాబాద్‌లో గురువారం అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో మూడు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నగర పరిధిలో పిడుగులు పడే అవకాశం కూడా ఉంది. దీంతో అధికారులను జీహెచ్‌ఎంసీ అప్రమత్తం చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ అన్నారు. అత్యవసర హెల్ప్‌ లైన్‌ ను కూడా ఏర్పాటు చేశారు.

అత్యవసర హెల్ప్‌ లైన్‌ నెం : 040-29555500, 040- 21111111

ఇప్పటికే గత రెండు రోజులుగా నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రోడ్లపై వర్షం నీరు నిలిచిపోవడంతో పలు చోట్ల ట్రాఫిక్‌ జామ్‌ కూడా అయ్యింది. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయం కూడా ఏర్పడింది.

Tags:    

Similar News