నగరం తడిసి ముద్దవుతోంది...గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే వాతావరణ శాఖ తెలంగాణ లోని పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఇక భాగ్యనగరం లో సైతం వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది.
హైదరాబాద్ లో నిన్న మధ్యాహ్నం వరకు చిరు జల్లులు కురిసినప్పటికీ.. సాయంత్రం పొడి వాతావరణం ఏర్పడింది. ఇక రాత్రి 10 గంటల తర్వాత వర్షం దంచికొట్టింది.దీంతో నైట్ షిఫ్ట్ వెళ్లే ఉద్యోగులు అలాగే ఇంటికి తిరిగి వచ్చే వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. రాత్రంతా వర్షం పడుతుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయ మయ్యాయి. కాగా ఈ రోజు కూడా నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు.