TG : కామారెడ్డిలో వర్ష బీభత్సం.. కొట్టుకుపోయిన జాతీయ రహదారి..

Update: 2025-08-28 08:00 GMT

కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. నిన్న కురిసిన వర్షాలకు పలు ప్రాంతాలు జలమయం కాగా..అనేక కాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఈ వరదలు రైల్వేతో పాటు రోడ్డు మార్గాలను తీవ్రంగా దెబ్బ తియ్యడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది.

భారీ వరదల ధాటికి కామారెడ్డిలోని రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో అనేక రైళ్లు రద్దు అయ్యాయి. తాజాగా బిక్నూర్ వద్ద ఉన్న జాతీయ రహదారి కూడా వరదల్లో కొట్టుకుపోయింది. దీంతో, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు రోడ్డు మార్గాలు దెబ్బ తినడంతో అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. నాగపూర్ వెళ్లే వాహనాలు రాజీవ్ రహదారి మరియు కరీంనగర్ మీదుగా వెళ్లాలని సూచించారు. అదేవిధంగా..ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వెళ్లే వాహనదారులు కొండాపూర్ నుండి మామడ, ఖానాపూర్, మెట్ పల్లి, జగిత్యాల, కరీంనగర్ మీదుగా ప్రయాణించాలని తెలిపారు. అవసరం లేకుండా ఎవ్వరు రోడ్ల మీదకు రావొద్దని...భారీ వరదల నేపథ్యంలో ప్రజలు, వాహన దారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News