Heavy Rains : భారీ నుంచి అతి భారీవర్షాలు.. పది జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్
తెలంగాణలోని పది జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ.. భద్రాది కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈదురుగాలులతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ తో పాటు పరిసర జిల్లాల్లో సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశం- ఉందంది. మరోవైపు ఏపీలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలోని తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, నంద్యాల, ఏలూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.