Conistable: మహిళా కానిస్టేబుల్ ను కడతేర్చిన సోదరుడు..

కులాంతర వివాహమే కారణం;

Update: 2024-12-02 06:00 GMT

తల్లిదండ్రులు చేసిన పెళ్లి బంధాన్ని తెంచేసుకుని మళ్లీ కులాంతర వివాహం చేసుకుందనే కోపంతో ఓ యువకుడు తన సోదరినే చంపేశాడు. డ్యూటీకి వెళుతున్న కానిస్టేబుల్ నాగమణిని కారుతో ఢీ కొట్టి ఆపై వేట కొడవలితో దాడి చేశాడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో జరిగిన ఈ దారుణం వివరాలు.. రాయపోలుకు చెందిన నాగమణి కానిస్టేబుల్.. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నారు. ఆమెకు గతంలోనే వివాహం కాగా పది నెలల క్రితమే విడాకులు తీసుకుంది.

నెల క్రితం కులాంతర వివాహం చేసుకుంది. ఈ వివాహంతో తమ కుటుంబ పరువు పోయిందని నాగమణి సోదరుడు ఆవేశంతో రగిలిపోయాడు. డ్యూటికీ వెళ్లేందుకు బయలుదేరిన నాగమణిని కారుతో ఢీ కొట్టాడు. కిందపడ్డ నాగమణిపై వేటకొడవలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. జనమంతా చూస్తుండగానే ఈ ఘోరానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన నాగమణి అక్కడికక్కడే చనిపోయింది. ఈ హత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నామని, నాగమణి సోదరుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.

 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో మహిళ కానిస్టేబుల్ నాగమణిని ఆమె తమ్ముడు దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటనపై Ntvతో మృతురాలు భర్త శ్రీకాంత్ మాట్లాడుతూ.. పరమేశ్ తమను చంపుతాడని తెలుసు.. కులంతర వివాహం చేసుకోవడంతోనే అతను నాగమణిపై కక్ష్య పెంచుకున్నాడని పేర్కొన్నాడు. పెళ్ళి చేసుకొని వచ్చిన తరువాత పోలిస్ స్టేషన్ బయటే మమ్మల్ని బెదిరించాడని ఆరోపించాడు. కానీ సొంత అక్క నాగమణినే చంపుతాడని అస్సలు ఊహించలేదని చెప్పుకొచ్చారు. నిన్న ఆదివారం సెలవు కావడంతో ఊరికి వచ్చాం.. అయితే, నాగమణి కంటే 10 నిమిషాల ముందే నేను బయల్దేరాను.. నాతో ఫోన్ లో మాట్లాడుతుండగానే ఆమెను పరమేశ్ కారుతో ఢీ కొట్టాడు.. నన్ను మా తమ్ముడు చంపడానికి వచ్చాడంటూ చెప్పింది అని మృతురాలి భర్త శ్రీకాంత్ వెల్లడించాడు.

ఇక, వెంటనే మా అన్నయ్యను వెళ్ళమని చెప్పాను అప్పటికే రక్తపు మడుగులో నాగమణి పడి ఉంది.. ఘటనా స్థలానికి వెళ్ళేలోపే చనిపోయింది అని ఆమె భర్త శ్రీకాంత్ తెలిపాడు. అయితే, కానిస్టేబుల్ నాగమణిని చంపిన పరమేశ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం మూడు టీమ్ లు ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు. సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా అతన్ని పట్టుకేనేందుకు గాలిస్తున్నాం.. నాగమణి భర్త ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం.. ఈ హత్యలో పరమేశ్ ఒక్కడే ఉన్నాడా లేక అతనికి ఇంకెవరైనా సహకరించారా అనేది తెలుస్తుంది అని పోలీసులు పేర్కొన్నారు.

Tags:    

Similar News