High Court : హైకోర్టు ఫైర్.. సున్నం చెరువు లెక్క తేలుస్తున్న హైడ్రా

Update: 2025-07-16 12:15 GMT

హైదరాబాద్ మాదాపూర్ సున్నం చెరువు వద్ద అధికారుల సర్వే కొనసాగుతుంది. రికార్డుల ప్రకారం సర్వే నెంబర్ 30లో సున్నం చెరువు 24 ఎకరాల 12 గుంటలు ఉన్నట్టు అధికారులు నిర్ధారించారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల సరిహద్దులను నిర్దారించకుండా సియెట్ సొసైటీలో కూల్చివేతలు ఎలా చేపడుతారంటూ హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు సున్నం చెరువు విస్తీర్ణం ఎంత అనే విషయాన్ని తమకు రిపోర్టు ఇవ్వాలని అధికారులును ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో రెవెన్యూ అధికారులు సున్నం చెరువు వద్ద సర్వే చేపట్టారు. చెరువు సరిహద్దులను కొలుస్తున్నారు. రెండు రోజుల పాటు ఈ సర్వే సాగనుంది. ఆ తర్వాత కోర్టుకు సర్వే రిపోర్టును అందజేయనున్నారు.

కాగా గతేడాది మాదాపూర్ సున్నం చెరువు పరిధిలో అధికారులు కూల్చివేతలు చేపట్టారు. పలు భవనాలతో పాటు చెరువు పక్కనే ఉన్న పేదల షెడ్లను కూల్చివేశారు. పేదలు ఆందోళనకు దిగడంతో హైడ్రాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. హైడ్రా చర్యలపై హైకోర్టు కూడా ఫైర్ అయ్యింది. అయితే ఈ కూల్చివేతలపై కోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో కోర్టు.. మొత్తం చెరువును సర్వే చేయాలని ఆదేశించింది.

Tags:    

Similar News