మెగాస్టార్ చిరంజీవి ఇంటి విషయంలో జీహెచ్ఎంసీకి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఇంటి పునరుద్ధరణలో భాగంగా చేపట్టిన నిర్మాణాలను క్రమబద్ధీకరించాలంటూ మెగాస్టార్ చిరంజీవి దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తును పరిశీలించి చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని జీహెచ్‌ఎంసీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పునరుద్ధరణలో భాగంగా చేపట్టిన రిటైన్ వాల్ క్రమబద్ధీకరణకు జూన్ 5న దరఖాస్తు చేసుకున్నా జీహెచ్‌ఎంసీ చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ చిరంజీవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2002లో అనుమతి తీసుకుని జీ+2 ఇంటిని నిర్మించినట్లు తెలిపారు. తరువాత పునరుద్ధరణలో భాగంగా ముందస్తు జాగ్రత్త చర్యగా అనుమతులు తీసుకున్నట్లు తెలిపారు. నిర్మాణాన్ని తనిఖీ చేసి క్రమబద్ధీకరించాలని కోరినా అధికారులు పట్టించుకోలేదన్నారు. జీహెచ్‌ఎంసీ తరఫు న్యాయవాది.. చట్టప్రకారం దరఖాస్తుపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.