తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉన్న మల్టీప్లెక్స్‌లకు ఊరటనిచ్చింది హైకోర్టు. దీనిపై ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసింది. 16 సంవత్సరాలలోపు పిల్లలను కూడా అన్ని షోలకు అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జనవరి 21న ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సవరించింది. దీనిపై తదుపరి విచారణను మార్చ్ 17కు వాయిదా వేసింది. రెగ్యులర్ షోలకు 16 ఏళ్ల లోపు వారిని అనుమతించిన హైకోర్టు.. ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలకు కూడా 16 ఏళ్ల లోపు వారిని అనుమతిస్తారా లేదా అన్నది తర్వాత విచారణలో తేలనుంది.