Telangana High Court : తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ..!
తమ ఆదేశాల్లో కొన్నిటిని ప్రభుత్వం అమలు చేయకపోవడం పై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.;
Telangana High Court : తెలంగాణలో కరోనా పరిస్థితుల పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. తమ ఆదేశాల్లో కొన్నిటిని ప్రభుత్వం అమలు చేయకపోవడం పై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్సల ధరలు ఒకే విధంగా ఉండేలన్న ఆదేశాలు అమలు చేయరా అని ప్రశ్నించింది. ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స గరిష్ట ధరలు సవరిస్తూ తాజా జీవో ఇచ్చారా అని ప్రశ్నించింది. కరోనా పై సలహా కమిటీ ఎందుకు ఏర్పాటు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. 14 కొత్త RTPCR లేబోరేటరీలు ఇంకా ఎప్పుడు అందుబాటులోకి వస్తాయంటూ ప్రభుత్వాన్నీ క్వశ్చన్ చేసింది.