Telangana High Court : తెలంగాణ సీఎస్ కి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసిన హైకోర్టు

Update: 2025-07-08 10:30 GMT

తెలంగాణ చీఫ్ సెక్రెటరీ కె.రామకృష్ణారావుకి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు . గ్రంథాలయ శాఖ స్వీపర్లకు పెంచిన వేతనాలు చెల్లించలేదని దాఖలైన పిటిషన్‌లో సీఎస్ కె.రామకృష్ణారావు, గ్రంథాలయ ప్రధాన కార్యదర్శి ఎన్.శ్రీధర్, పబ్లిక్ లైబ్రరీస్ డైరెక్టర్ ఎస్.శ్రీనివాసాచారిలకు నోటీసులు జారీ చేసింది. జీవో 841, 33 ప్రకారం లైబ్రేరియన్ గ్రేడ్-3తో సమానంగా పార్ట్ టైమ్ స్వీపర్లకు కూడా సమానంగా వేతనాలు చెల్లించాలని గత ఏడాది డిసెంబర్ 19వ తేదీన ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. అయితే ఇప్పటివరకూ కోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పలు స్వీపర్లు. దీనిపై జస్టిస్‌ నగేశ్‌ భీమపాక విచారణ చేపట్టి ప్రతివాదులైన ఐఏఎస్‌ అధికారులకు మార్చి 28న నోటీసులు జారీ చేసినా వారి తరఫున న్యాయవాదులు హాజరుకాలేదు. అయితే కోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడం కోర్టు దిక్కరణగా పరిగణించాల్సి వస్తుందని హైకోర్టు పేర్కొంది. ఈ నెల 24వ తేదీన వ్యక్తిగతంగా హాజరయ్యి వివరణ ఇవ్వాలని సీఎస్‌తో పాటు ఇద్దరు ఐఏఎస్ అధికారులను హైకోర్టు ఆదేశించింది.

Tags:    

Similar News