Telangana High Court : కాంగ్రెస్ నేత ఝాన్సీరెడ్డికి హైకోర్టు నోటీసులు

Update: 2025-05-23 11:15 GMT

వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ఝాన్సీరెడ్డికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. వివాదాస్పద భూమి కొనుగోలు విషయంలో ఝాన్సీ రెడ్డితో పాటు ఆమె భర్త రాజేందర్ రెడ్డికి కూడా హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే... 2017లో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గుర్తూరులో ఝాన్సీ రెడ్డి దంపతులు 75 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. కాంగ్రెస్ సర్కార్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కోసం ఈ స్థలంలో శంకుస్థాపన చేయడంతో భూమి వ్యవ హారం వెలుగులోకి వచ్చింది. ఈ స్థలాన్ని ఝాన్సీరెడ్డి ఎలా కొనుగోలు చేశారని దామోదర్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటి షన్ దాఖలు చేశారు. భారత పౌరసత్వాన్ని వదిలి అమెరికా పౌరసత్వాన్ని స్వీకరిం చిన ఝాన్సీరెడ్డి, విదేశీ మారక వ్యవహా రాల చట్టం ప్రకారం వ్యవసాయ భూమి కొనుగోలు చేయడం నేరమని, తప్పుడు డాక్యుమెంట్స్ చూపించి భూమిని కొనుగోలు చేశారని ఫిర్యాదులో ఆరోపించారు.

Tags:    

Similar News