High Court : ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు హైకోర్టు షాక్

Update: 2025-05-03 10:00 GMT

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ప్రభాకర్ రావు దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు శుక్రవారం తిరస్కరించింది. ప్రభాకర్ రావు ఎస్ఎస్ఐబీ చీఫ్ హోదాలో ఉన్న సమయంలో పలువురి ఫోన్లు ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన సిట్ ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్పై కేసు నమోదు చేయగానే ఆయన అమెరికా పారిపోయారు. ప్రస్తుతం అమెరికాలో క్యాన్సర్ వ్యాధి చికిత్స తీసుకుంటున్న ప్రభాకర్ రావు తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయిం చారు. తనకు ముందస్తు బెయిల్ ఇస్తే కేసు విచారణకు సహకరిస్తానని తెలిపాడు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు ఇరువర్గాల వాదనలు పరిశీలించింది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాక ర్ కీలకనింది తుడని, అతనికి ముందస్తు బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేస్తాడని పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. పోలీసుల అభ్యర్ధనలతో ఏకీభవించిన హైకోర్టు ప్రభాకర్ బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చింది. మరోవైపు అమె రికాలో ఉన్న ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు పోలీసులు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావు పాస్ పోర్టు రద్దు చేయడంతో పాటు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉంటే.. హైకోర్టు బెయిల్ తిరస్కరించడంతో ప్రభాకర్రావు సైతం ఈ కేసులో మరో నిందితుడు శ్రవణారావు తరహాలో సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది.

Tags:    

Similar News