Telangana : హైకోర్టు తీర్పు.. దూకుడు పెంచిన ఏసీబీ

Update: 2025-01-07 10:15 GMT

కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు అరెస్టుపై స్టే కూడా ఎత్తేసింది. చట్టప్రకారం నడుచుకోవాలని సూచించింది. అటు నందినగర్‌లోని కేటీఆర్ ఇంటికి హరీశ్ రావు, కవిత చేరుకున్నారు. లీగల్ టీమ్‌తో వీరు ముగ్గురు చర్చలు జరుపుతున్నారు. క్వాష్ పిటిషన్ కొట్టేయడంతో భవిష్యత్ కార్యాచరణ ఏంటని సమాలోచనలు చేస్తున్నారు.

మరోవైపు కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను కోర్టు కొట్టేయడంతో ఏసీబీ దూకుడు పెంచింది. ఫార్ములా-ఈ రేసు కేసుకు సంబంధించి పలు చోట్ల సోదాలు చేపట్టింది. హైదరాబాద్, విజయవాడలోనూ గ్రీన్ కో, ఏస్ జెన్‌నెక్ట్స్ ఆఫీసుల్లో రికార్డులు పరిశీలిస్తోంది. కోర్టు తీర్పు నేపథ్యంలో నేడు విచారణకు హాజరు కాలేనని కేటీఆర్ తెలపగా ఏసీబీ అనుమతి ఇచ్చింది. విచారణకు ఎప్పుడు రావాలో ఇవాళ క్లారిటీ ఇవ్వనుంది.

ఫార్ములా-e రేస్ కేసులో కేటీఆర్ క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ACB వాదనలను పరిగణనలోకి తీసుకొని తీర్పు ఇచ్చింది. అటు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలన్న కేటీఆర్ లాయర్ వినతిని తోసిపుచ్చింది. దీంతో ఏసీబీ, ఈడీలకు మాజీ మంత్రిని విచారించేందుకు కోర్టు అనుమతి ఇచ్చినట్లైంది. కాగా ఈ పిటిషన్‌పై నేడు తీర్పు రానుందనే తర్వాత విచారణకు వస్తానని EDకి కేటీఆర్ లేఖ రాశారు.

Tags:    

Similar News