Ambedkar University : అంబేద్కర్ యూనివర్సటీ ద్వారా పోలీసులకు ఉన్నత విద్య

Update: 2025-08-15 11:00 GMT

తెలంగాణ పోలీసులకు అంబే ద్కర్ యూనివర్సిటీ ఉన్నత విద్యను అందించనుంది. ఈ మేరకు పోలీసుశాఖ, యూనివర్సిటీ అధికారుల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. రాష్ట్ర పోలీస్ శాఖలో గ్రాడ్యుయేట్ చదవని లేదా మధ్యలో నిలిపివేసిన కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలు, అసిస్టెంట్ రిజర్వ్ సన్ఇన్స్పెక్టర్లకు ఓపెన్ యూనివర్సీ దూరవిద్య విధానంలో ప్రవేశం కల్పిస్తారు. పోలీసులు వారానికి ఒక రోజు క్లా సులకు హాజరవడం ద్వారా తమ చదువును కొనసాగించేందుకు వీలు కల్పిస్తారు. చదువు పూర్తి చేసుకున్న వారు యూనివర్సిటీ ద్వారా గ్రాడ్యుయేట్ డిగ్రీలను పొందేందుకు వీలు కల్పిస్తారు. ఈ మేరకు అవగాహన ఒప్పందంపై డీపీజీ జితేందర్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సి టీ వీసీ ఘంటా చక్రపాణి సంతకాలు చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ రాష్ట్రంలో 30వేల మంది పోలీసు సిబ్బందికి డిగ్రీ లేదని, వాళ్లందరినీ గ్రాడ్యుయేట్లుగా చేసేందుకు ప్రత్ని స్తున్నామన్నారు. డిగ్రీ ఉంటే సిబ్బందిలో ఆత్మ విశ్వాసం పెరుగుతుందన్నారు. వీసీ చక్రపాణి మాట్లాడుతూ ఇంటర్ చదివిన పోలీసు సిబ్బం దీని గ్రాడ్యుయేట్లుగా చేసేందుకు ఈ ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. పోలీసులకు ఆన్లైన్ క్లాసుల ద్వారా అదనంగా శిక్షణ ఇస్తామన్నా రు. జిల్లాల్లో పరిస్థితులను బటిట స్టడీ సెంటర్ల ద్వారా శిక్షణ ఇస్తామన్నారు.

Tags:    

Similar News