Amit Shah : జీవితంలో ఒక్కసారైనా సమతా మూర్తిని దర్శించుకోవాలి : అమిత్ షా
Amit Shah : రామానుజ చార్యులు వెయ్యేళ్ల క్రితమే సమతా సూత్రం బోధించారన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.;
Amit Shah : రామానుజ చార్యులు వెయ్యేళ్ల క్రితమే సమతా సూత్రం బోధించారన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. జీవితంలో ఒక్కసారైనా సమతా మూర్తిని దర్శించుకోవాలన్నారు. శంకరాచార్యులు కూడా సనాతన ధర్మాన్ని కాపాడారని గుర్తు చేశారు. దేశంలో ప్రసిద్ధ క్షేత్రంగా సమతా కేంద్రం ఖ్యాతి గడిస్తుందన్నారు.సమతా కేంద్రంలోని 108 దివ్య దేశాలను అమిత్ షా దర్శించుకున్నారు. సెల్ఫ్ గైడ్ టూల్ ద్వారా దివ్య క్షేత్రాల విశిష్టత తెలుసుకున్నారు. చిన్న జీయర్ స్వామి దగ్గరుండి సమతా మూర్తి కేంద్రం విశేషాలను వివరించారు.
హైదరాబాద్ గర్వించేలా సమతా మూర్తి ఏర్పాటు చేశామన్నారు చినజీయర్ స్వామి. 1035 కుండలాలతో మహాయజ్ఞం కొనసాగుతుందన్నారు. ఇవాళ, రేపు ధర్మాచార్య సదస్సు నిర్వహిస్తామన్నారు. ప్రధాని, అమిత్ షా ధర్మపాలన చేస్తున్నారని చెప్పారు. అంతకుముందు శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న అమిత్ షా కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్వాగతం పలికారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో ముచ్చింతల్ చేరుకున్నారు అమిత్ షా.
ముచ్చింతల్ శ్రీరామ నగరంలోని సమతామూర్తిని సందర్శించిన కేంద్ర హోం మంత్రి శ్రీ @AmitShah#AmitShahInBhagyanagar pic.twitter.com/t75Lu2N2Bi
— BJP Telangana (@BJP4Telangana) February 8, 2022