House Motion Petition : అంబులెన్స్‌ల నిలిపివేతపై హౌస్ మోషన్ పిటిషన్
తెలంగాణ పోలీసులపై హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు నమోదైంది. సరిహద్దుల్లో ఏపీ అంబులెన్స్ లను అడ్డుకుంటున్నారని పిటిషన్ వేశారు.;
తెలంగాణ పోలీసులపై హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు నమోదైంది. సరిహద్దుల్లో ఏపీ అంబులెన్స్ లను అడ్డుకుంటున్నారని రిటైర్డ్ IRS ఆఫీసర్ గరిమెళ్ల వెంకట కృష్ణారావు పిటిషన్ వేశారు. అంబులెన్లను అడ్డుకోవద్దని హైకోర్టు ఆదేశించినా, తెలంగాణ పోలీసులు దాన్ని బేఖాతరు చేస్తున్నారని పేర్కొన్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి, పోలీసులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి అన్ని అంబులెన్స్‌లను అనుమతించేలా ఆదేశాలివ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా ఇతర రాష్ట్రాల నుంచి కరోనా చికిత్స కోసం హైదరాబాద్‌కు వస్తున్న బాధితుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో.. అంబులెన్స్‌లకు కూడా ముందస్తు అనుమతి తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం గురువారం రాత్రి మార్గదర్శకాలు జారీ చేసింది.