Hydra : నోటీసులు ఇవ్వకుండా ఇండ్లు ఎలా కూలుస్తారు.. ప్రభుత్వంపై కవిత ఫైర్

Update: 2025-09-22 09:47 GMT

హైదరాబాద్ కుత్బుల్లాపూర్‌లోని గాజులరామారం సర్వే నెంబర్ 307లో అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఈ కూల్చివేతలకు నిరసనగా స్థానికులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య దేవేందర్ నగర్, బాలయ్య బస్తీ, గాలిపోచమ్మ బస్తీలలో వందలాది ఇళ్లను అధికారులు కూల్చివేశారు. ఈ ప్రాంతంలోని ప్రభుత్వ భూమిని తిరిగి తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు హైడ్రా అధికారులు తెలిపారు. కూల్చివేతలు వెంటనే ఆపాలని స్థానికులు హైడ్రా సిబ్బందిని అడ్డుకున్నారు. తమ ఇళ్లను ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్నామని, ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా కూల్చివేయడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత గాజులరామారంలోని గాలిపోచమ్మ బస్తీలో పర్యటించి, ఇళ్లు కోల్పోయిన బాధితులతో మాట్లాడారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేయడం దారుణమని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యపై ప్రభుత్వం స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు.

Tags:    

Similar News