Saraswati Pushkaralu : సరస్వతి పుష్కరాలకు ఇలా చేరుకోండి

Update: 2025-05-14 16:45 GMT

హైదరాబాద్ వరంగల్ నుండి వచ్చే వాహనాలు కాటారం మండలం గంగారం ఎక్స్ రోడ్ మీదుగా కాలేశ్వరం చేరుకుంటాయి. అలాగే మహారాష్ట్ర చతీస్గడ్ నిర్మల్ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నుంచి వచ్చే వాహనాలు.. సిరోంచ మీదుగా కాలేశ్వరం చేరుకోనున్నాయి. పుష్కర పనులను దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ దగ్గరుండి మరీ పరిశీలిస్తున్నారు. సరస్వతి పుష్కరాలపై తెలంగాణ పర్యాటక శాఖ ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. భక్తులు పుణ్య స్నానాలు చేసేందుకు కాళేశ్వరం త్రివేణి సంగమం ఏరియాలో ప్రత్యేక ఘాట్లు ఏర్పాటుచేసింది.

Tags:    

Similar News