HYD : తాగిన మైకంలో కానిస్టేబుల్ వీరంగం
నడీరోడ్డుపై గలాటా సృష్టించడంతో రోడ్డుపై భారీ గా ట్రాఫిక్ జాం అయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు;
తాగిన మైకంలో ఓ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. నడిరోడ్డుపై పెట్రోలింగ్ వాహనాన్ని ఆపి, అసభ్య పదజాలంతో దూషిస్తూ హంగామా చేశాడు. ఈ ఘటన శంషాబాద్ పరిథిలోని హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద జరిగింది. కానిస్టేబుల్ రాజ మల్లయ్య గుర్తించారు పోలీసులు. నడీరోడ్డుపై గలాటా సృష్టించడంతో రోడ్డుపై భారీ గా ట్రాఫిక్ జాం అయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
డయల్ 100 కు సమాచారమివ్వగా కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు. రాజ మల్లయ్యను, ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా గుర్తించారు. కానిస్టేబుల్ వ్యవహారాన్ని వీడియో తీసిన వాహనదారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.