హైదరాబాద్ కేపీహెచ్‌బీలోని కైతలాపూర్ గ్రౌండ్స్‌లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి.. వేడుకలకు అతిరథ మహారధులంతా తరలివచ్చారు.. సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.. అతిథులందరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ సందడి చేస్తున్నారు.. దర్శకుడు విజయేంద్ర ప్రసాద్, నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వనీదత్‌తోపాటు పలువురు వీవీఐపీలు తరలివచ్చారు.. ఇక ఎన్టీఆర్ శతి జయంతి ఉత్సవాలకు వేలాదిగా ఎన్టీఆర్ అభిమానులు, ప్రజలు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారిపోయింది.
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో బాలకృష్ణ సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు.. కొద్దిసేపటి క్రితమే సీనియర్ నటి జయప్రద కూడా కార్యక్రమానికి వచ్చారు.. ఆమెను బాలకృష్ణ ఆప్యాయంగా పలకరించారు.. అటు ఎన్టీఆర్ చిత్రాల్లో పాటలు, సాంస్కృతిక ప్రదర్శనలను ఆసక్తిగా తిలకిస్తున్నారు బాలకృష్ణ.. అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతూ చిరునవ్వులు చిందిస్తూ సందడి చేస్తున్నారు.