HYD: ఏఐ హబ్‌ గా హైదరాబాద్

Update: 2025-11-15 05:30 GMT

అమె­రి­కా­కు చెం­దిన ప్ర­ముఖ సా­ఫ్ట్‌­వే­ర్ సేవల సం­స్థ బ్లా­క్‌­బ­డ్ భా­ర­త­దే­శం­లో తన మొ­ట్ట­మొ­ద­టి కా­ర్యా­ల­యా­న్ని హై­ద­రా­బా­ద్‌­లో ప్రా­రం­భిం­చిం­ది. గడి­చిన ఏడా­ది­గా భారత మా­ర్కె­ట్‌­లో కా­ర్య­క­లా­పా­లు ని­ర్వ­హి­స్తు­న్న ఈ సం­స్థ­కు, ఇది దే­శం­లో నె­ల­కొ­ల్పిన మొ­ట్ట­మొ­ద­టి ఆఫీ­స్ కా­వ­డం వి­శే­షం. ప్ర­పం­చ­వ్యా­ప్తం­గా ఉన్న తమ క్ల­యిం­ట్ల­కు ఇన్నో­వే­ష­న్, ఆర్టి­ఫి­షి­య­ల్ ఇం­ట­లి­జె­న్స్ (AI) ఇం­టి­గ్రే­ష­న్, ప్రొ­డ­క్ట్ డె­వ­ల­ప్‌­మెం­ట్ వంటి కీలక సే­వ­ల­ను అం­దిం­చ­డా­ని­కి ఈ కొ­త్త కా­ర్యా­ల­యం వ్యూ­హా­త్మక కేం­ద్రం­గా పని­చే­య­నుం­ది. ఈ సెం­ట­ర్ ద్వా­రా బ్లా­క్‌­బ­డ్ తన అం­త­ర్జా­తీయ సే­వ­ల­ను వి­స్త­రిం­చ­నుం­ది. ఈ సం­ద­ర్భం­గా కం­పె­నీ ఎగ్జి­క్యూ­టి­వ్ వైస్ ప్రె­సి­డెం­ట్, చీఫ్ ఆప­రే­టిం­గ్ ఆఫీ­స­ర్ కె­వి­న్ గ్రె­గో­యి­ర్ మా­ట్లా­డు­తూ, "ప్ర­పం­చ­స్థా­యి ప్ర­తి­భా వ్య­వ­స్థ, శక్తి­వం­త­మైన టె­క్నా­ల­జీ కల్చ­ర్ కలి­గిన హై­ద­రా­బా­ద్‌­లో ఈ టె­క్నా­ల­జీ సెం­ట­ర్‌­ను ఏర్పా­టు చే­య­డం, అం­త­ర్జా­తీయ లీ­డ­ర్‌­గా ఎది­గేం­దు­కు ఎం­త­గా­నో దో­హ­ద­ప­డు­తుం­ది" అని అన్నా­రు.

పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

రా­ష్ట్ర ని­రు­ద్యో­గు­ల­కు తె­లం­గాణ స్టే­ట్ లె­వె­ల్ పో­లీ­స్ రి­క్రూ­ట్మెం­ట్ బో­ర్డు(TSLPRB) శు­భ­వా­ర్త చె­ప్పిం­ది. శు­క్ర­వా­రం 60 ఉద్యో­గా­ల­కు నో­టి­ఫి­కే­ష­న్ వి­డు­దల చే­సిం­ది. వీ­టి­లో సైం­టి­ఫి­క్ ఆఫీ­స­ర్, సైం­టి­ఫి­క్ అసి­స్టెం­ట్, లే­బొ­రే­ట­రీ టె­క్నీ­షి­య­న్, లే­బొ­రే­ట­రీ అటెం­డెం­ట్ పో­స్టు­లు­న్నా­యి. అభ్య­ర్థు­లు ఈ నెల 17 ఉదయం 8 గంటల నుం­చి డి­సెం­బ­ర్ 15 సా­యం­త్రం 5 గంటల వరకు వె­బ్‌­సై­ట్‌­లో దర­ఖా­స్తు చే­సు­కో­వా­ల­ని సూ­చిం­చిం­ది. అర్హ­త­ల­తో పాటు పూ­ర్తి వి­వ­రా­ల­కు వె­బ్సై­ట్ను సం­ద­ర్శిం­చా­ల­ని తె­లి­పిం­ది. నో­టి­ఫి­కే­ష­న్‌ పూ­ర్తి వి­వ­రాల కోసం [https://www.tgprb.inలో](https://www.tgprb.inలో) చూ­డా­ల­ని అధి­కా­రు­లు తె­లి­పా­రు.

Tags:    

Similar News