Hyderabad : 2008 డీఎస్సీ మహిళా అభ్యర్థుల రిలే నిరాహార దీక్ష

Update: 2023-03-08 13:37 GMT

హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద డీఎస్సీ 2008కి చెందిన మహిళా అభ్యర్థులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. బీఈడీ మెరిట్‌ క్యాండిడేట్స్‌ అసోసి యేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి టీడీపీ నేత తిరునగరి జ్యోత్స్న మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె ఉద్యోగా లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం పదే పదే మోసం చేస్తోందని మండిపడ్డారు. అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని గతేడాది సెప్టెంబర్‌లో హైకోర్టు అను కూలంగా తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.

Similar News