Hyderabad: డబుల్ ధమాఖా... నగరవాసి నోస్టాల్జియా...

హైదరాబాద్ కు తిరిగివచ్చిన డబుల్ డెక్కర్లు; రెండు దశాబ్దాల అనంతరం అందుబాటులోకి వచ్చిన ఎలక్ట్రిక్ బస్సులు....

Update: 2023-02-08 06:01 GMT

హైదరాబాద్ మహానగరంలో మరోసారి డబుల్ డెక్కర్ బస్సులు రయ్.. రయ్ మంటూ దూసుకుపోతున్నాయి. మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి కేటీఆర్, చీఫ్ సెక్రటరీ శాంతకుమారి సంయుక్తంగా బస్సులకు జెండా ఊపి లాంఛనంగా వాటి సేవలను ప్రారంభించారు.  ఎంపీ రంజిత్ రెడ్డి, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, ప్రత్యేక ఛీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫిబ్రవరీ 11న ఫార్ములా ఈ ప్రిక్స్ ప్రారంభమవుతుండటంతో ఎలక్ట్రిక్ డబల్ డెక్కర్ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చారు. టాంక్ బండ్, నెక్లెస్ రోడ్, ప్యారడైజ్, నిజామ్ కాలేజ్ మార్గాల్లో తిరగనున్నాయి. నగర పర్యాటకాన్ని మరింత పెంపొందించేందుకు చారిత్రక కట్టడాల వద్ద వీటి వినియోగాన్ని పెంచాలని పర్యాటక శాఖ భావిస్తోంది. హైదరాబాద్ లోని డబుల్ డెక్కర్ బస్సులు చారిత్రక ప్రాధాన్యతను కలిగి ఉన్న సంగతి తెలిసిందే. నిజాం హయాంలో ప్రవేశపెట్టిన ప్రాచీన డబుల్ డెక్కర్ బస్సు 2003 వరకూ నగరం వీధుల్లో సంచరించాయి. HMDA మరో ఆరు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్లకు ఆర్డర్లు ఇచ్చిందని తెలుస్తోంది. వీటిలో మూడు డెలివర్ అవ్వగా, మిగిలినవి మరి కొన్ని రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. 

Tags:    

Similar News