Hyderabad : కొంపల్లిలో వీధికుక్కల స్వైరవిహారం
జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదంటున్నారు. ప్రజలు ప్రాణాలు అంటే లెక్కలేదా అంటూ ప్రశ్నిస్తున్నారు.;
హైదరాబాద్ కొంపల్లిలో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఆరుగురిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచాయి. గాయపడిన వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. అదేవిధంగా దుండిగల్ తాండలో రాకపోకలు సాగిస్తున్న వారిపై కూడ వీధికుక్కలు దాడి చేశాయి. దీంతో ఈ వీధికుక్కలు ఏక్షణాన ఎక్కడి నుండి వచ్చి దాడి చేస్తాయోనని ప్రజలు భయాం దోళన చెందుతున్నారు.
ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అంబర్‌పేట ఘటన జరిగిన తర్వాత జీహెచ్ ఎంసీ అధికారులు ఆపరేషన్ డాగ్ కార్యక్రమం చేపట్టారు. అయితే ఆపరేషన్ డాగ్ చేపట్టినా ఫలితం లేదంటున్నారు నగరవాసులు. అసలు జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదంటున్నారు. ప్రజలు ప్రాణాలు అంటే లెక్కలేదా అంటూ ప్రశ్నిస్తున్నారు.