CP Sandeep Shandilya : ఇద్దరమ్మాయిలకు ఫ్రెండ్ రెక్వెస్ట్.. ఫోటోలు మార్ఫింగ్.. ఆ తర్వాత బలవంతంగా..
సోషల్ మీడియాతో జాగ్రత్త.. హైదరాబాద్ సీపీ;
ప్రస్తుత కాలంలో సామాజికమాధ్యమాల వాడకం పెరిగింది. అపరిచితులతో స్నేహంతాత్కాలిక ఆనందాన్ని ఇచ్చినా ఆ తర్వాత అంతులేని విషాదాన్ని నింపుతోంది. ఎదుటివారి గురించి పూర్తిగా తెలియకుండా వ్యక్తిగత విషయాలు పంచుకోవడం అనర్ధాలకు దారితీస్తుంది. అపరిచితుల స్నేహం, ప్రేమ ముసుగులో ఎందరో మహిళలు, యువతులు మోసపోతున్నట్లు పోలీసుల పరిశీలనలో వెల్లడైంది. సామాజిక మాధ్యమాల విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్‌లో ఉండే ఓమైనర్ బాలికకు ఆర్నెళ్ల క్రితం ఓ అపరిచిత వ్యక్తి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. వెంటనే బాలిక రిక్వెస్ట్‌ను అంగీకరించగా గుర్తుతెలియని యువకుడు తరచూ చాటింగ్ చేసేవాడు. ఆ తర్వాత ఒకరి ఫోన్‌నెంబర్లు, ఇంకొకరికి ఇచ్చిపుచ్చుకున్నారు. వాట్సాప్‌లో వీడియోకాల్స్‌చేసుకున్నారు. మూడునెలల తర్వాత ఆ అమ్మాయి వాట్సాప్‌కు యువకుడు వీడియోలు పంపించాడు. అవి చూసిన అమ్మాయి ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. వీడియోకాల్ చేసినప్పుడు స్కీన్‌రికార్డ్‌చేసి వాటినే సాంకేతికతతో మార్పింగ్ చేసినట్లు బాలిక గుర్తించింది. ఆ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక తనలోనే కుమిలిపోయింది. యువకుడు క్రమంగా బెదిరింపులకు పాల్పడటంమొదలుపెట్టాడు. లైంగికవాంచ తీర్చకపోతే నగ్నదృశ్యాల్ని సామాజికమాధ్యమాల్లో ఉంచుతానని బెదిరించాడు. భయపడిన యువతి నిందితుడు చెప్పినట్లు చేసింది. వేధింపుపులు తీవ్రంకావంతో తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదుచేసింది. పోలీసుల నిందితుడిని అరెస్ట్ చేశారు. వారం వ్యవధిలో హైదరాబాద్ పోలీసులకు ఫేస్‌బుక్ స్నేహితుల వల్ల మోసపోయిన ఇద్దరు మైనర్ బాలికలు ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వెంటనే ఫిర్యాదు చేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య సూచించారు.
కరోనా తర్వాత సెల్‌ఫోన్ వినియోగం బాగా పెరిగినట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఆన్‌లైన్ తరగతుల కోసం తల్లిదండ్రులు చిన్నారులకు స్మార్ట్‌ఫోన్లు ఇచ్చారు. పలు విషయాల కోసం విద్యార్థులు అంతర్జాలంలో శోధిస్తున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా సామాజికమాధ్యమాల్లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. తెలిసీతెలియని వయసులో ఆకర్షణకు లోనవుతున్నట్లు పోలీసుల పరిశీలనలో వెల్లడైంది. మోసాల బారినపడకుండా సామాజిక మాధ్యమాలు వినియోగించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
చిన్నారులను తల్లిదండ్రులు నిత్యం గమనిస్తూ ఉండాలని...వారి ప్రవర్తనలో మార్పులొచ్చినప్పుడు సమస్యను అడిగి తెలుసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. యువతులు ఒకవేళ మోసగాళ్ల ఉచ్చులో చిక్కితే అధైర్యపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరుతున్నారు.