హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) నిధుల గోల్ మాల్ కేసుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ అసోసియేషన్ నిధుల గోల్ మాల్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారం చర్యలు చేపట్టింది. అందులొ భాగంగా హెచ్సీఏకి చెందిన రూ. 51 లక్షల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. హెచ్సీఏ నిధులతో ప్రైవేట్ ఆస్తులు కొనుగోలు చేసినట్లు తమ దర్యాప్తులో ఈడీ గుర్తిం చింది. అలాగే అను మతులు లేకుండా పరికరాలను సైతం కొను గోలు చేసినట్లు వెల్లడైంది. క్రికెట్ బంతులు, జిమ్ పరికరాలతోపాటు బకెట్, కుర్చీల కొనుగోలులో సైతం నిధుల దుర్వినియోగం అయినట్లు ఈడీ గుర్తించింది. ఇక కాంట్రాక్టుల పేరుతో క్విడ్ ప్రో కో జరిగినట్లు ఈడీ అభియోగం నమోదు చేసిం ది. ఆ క్రమంలో హెచ్సీఏ మాజీ ట్రెజరర్ సురేందర్ అగర్వాల్పై ఈడీ అభియోగం నమోదు చేసింది. అందులో భాగంగా క్రికెట్ బాల్స్, బకెట్, చైర్స్, జిమ్ ఎక్విప్మెంట్ పేరుతో హెచ్ సీఏ సబ్ కాంట్రాక్టులు ఇచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అయితే ఆయా కాంట్రాక్టుల అప్ప గించడంతో సురేందర్ అగర్వాలు క్విడ్ ప్రో కో కింద మూడు కంపెనీలు రూ. 90 లక్షల మేర నగదు చెల్లించినట్లు ఈడీ గుర్తించింది. ఇక సురేంద్ర అగర్వాల్ తో పాటు అతని కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలలో రూ. 90 లక్షలకు పైగా నగదు ఉన్నట్లు . ఈడీ ఉన్నతాధికారులు గుర్తించారు. అంటే హెచ్సీఏ మాజీ వైస్ ప్రెసి డెంట్ సురేందర్ అగర్వాల్ భార్య, కుమారుడు, కోడలు అకౌంట్లకు ఈ నగదు బదిలీ చేసినట్లు ఈడీ దర్యాప్తులో గుర్తించారు. సురేందర్ అగర్వాల్ భార్యకు చెందిన కేబీ జ్యువెలర్స్ ఖాతాకు ఈ నగదు చెల్లించినట్లు రుజువైంది. దీంతో రూ. 90 లక్షలలో రూ. 51.29 లక్షల ఆస్తు లను ఈడీ బుధవారం అటాచ్ చేసినట్లు అయింది.