Ganesh Immersion : హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనంపై హైకోర్టు ఏం చెప్పిందంటే!

Update: 2024-09-11 07:45 GMT

హుస్సేన్ సాగర్ గణేశ్ నిమజ్జనానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోర్టు ధిక్కార పిటిషన్ ను తిరస్కరించింది. 2021 ఆదేశాలు యధావిధిగా కొనసాగుతాయని న్యాయస్థానం తెలిపింది. వాటిని అమలు చేయాలని స్పష్టం చేసింది. కోర్టు ధిక్కరణకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని హైకోర్టు తెలిపింది.

నిమజ్జన సమయంలో ఇలాంటి పిటిషన్లు సరికాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. గత ఆదేశాల్లో హైడ్రా లేదన్న న్యాయస్థానం.. ఇప్పుడు హైడ్రాను ఎలా చేరుస్తామని ప్రశ్నించింది. హైడ్రాను ప్రతివాదిగా చేర్చాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని సైతం కోర్టు తిరస్కరించింది.

Tags:    

Similar News