Hyderabad Metro: మెట్రో సర్వీసులపై ఉద్యోగుల సమ్మె ఎఫెక్ట్..
Hyderabad Metro: మెట్రో కాంట్రాక్ట్ ఉద్యోగులను చర్చలకు పిలిచింది యాజమాన్యం. ప్రస్తుతం ధర్నా విరమిస్తున్నామని మెట్రో టికెటింగ్ సిబ్బంది వెల్లడించారు.;
Hyderabad Metro: మెట్రో కాంట్రాక్ట్ ఉద్యోగులను చర్చలకు పిలిచింది యాజమాన్యం. ప్రస్తుతం ధర్నా విరమిస్తున్నామని మెట్రో టికెటింగ్ సిబ్బంది వెల్లడించారు. మొదటి దశ చర్చలు జరిగాయని.. కియోలిస్ ప్రతినిధులతో సాయంత్రం మళ్లీ చర్చలు జరుపుతామన్నారు. వేతనాలు పెంచాలని ప్రధానంగా డిమాండ్ చేశామని వారు వెల్లడించారు. మరోసారి చర్చలు జరిపాక తమ నిర్ణయం వెల్లడిస్తామని పేర్కొన్నారు. స్పష్టమైన హామీ వచ్చే వరకు విధులకు హాజరు అయ్యేది లేదన్నారు.
అటు.. హైదరాబాద్ మెట్రో సర్వీసులపై ఉద్యోగుల సమ్మె ఎఫెక్ట్ పడింది.. రెడ్ లైన్‌లో టికెటింగ్ వ్యవస్థ స్తంభించింది.. మియాపూర్ - ఎల్బీనగర్ వరకు రెడ్ లైన్ టికెటింగ్ ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళన చేశారు.
ఐదేళ్లుగా జీతాలు పెంచడం లేదని వాపోయారు.. ఉద్యోగుల ఆరోపణలను హైదరాబాద్ మెట్రో రైల్ యాజమాన్యం కొట్టిపారేసింది. టికెటింగ్ సిబ్బంది చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని పేర్కొంది.. ధర్నా చేస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు.. నిరసన తెలియజేస్తున్న సిబ్బంది సమస్యలు తెలుసుకోవడానికి వారితో చర్చలు జరుపుతోంది.