METRO: ఎల్బీనగర్‌ టు హయత్‌నగర్‌ మెట్రో రైలు పరుగు

ఏడు కిలోమీటర్ల మెట్రోను విస్తరించేందుకు డీపీఆర్‌ సిద్ధం... ఆరు స్టేషన్లతో మెట్రో రూట్‌ మ్యాప్;

Update: 2024-07-12 03:00 GMT

హైదరాబాద్‌ మెట్రోను మరింత విస్తరించనున్నారు. ఎల్బీనగర్ నుంచి హయత్‌ నగర్‌ వరకూ ఏడు కిలోమీటర్ల మెట్రోను విస్తరించేందుకు డీపీఆర్‌ సిద్ధమైంది. మొత్తం ఏడు కిలోమీటర్ల దూరానికి ఆరు స్టేషన్లతో మెట్రోకు అధికారులు తుది మార్గాన్ని సిద్ధం చేశారు. మెట్రోరైలు ఫేజ్ 2 పనులను ప్రారంభించేందుకు మెట్రో సంస్థ శ్రీకారం చుట్టింది. ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకూ మెట్రో మార్గాన్ని విస్తరించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకూ మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకూ మాత్రమే మెట్రో అందుబాటులో ఉంది. అయితే ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకూ సుమారు 7 కిలోమీటర్ల మెట్రోను విస్తరించాలని నిర్ణయించింది. ఒక్కో కిలోమీటరుకు అటూ ఇటుగా ఒక్కో స్టేషన్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకూ సుమారు 7 కిలోమీటర్ల మెట్రోను విస్తరించాలని నిర్ణయించింది. ఒక్కో కిలోమీటరుకు అటూ ఇటుగా ఒక్కో స్టేషన్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది. ఇప్పటికే ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ మీదుగా హైవే విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. అలాగే ఫ్లై ఓవర్ల నిర్మాణాన్ని కూడా చేపట్టనున్నారు.



 



    ఇందులో భాగంగానే మెట్రో పిల్లర్ల నిర్మాణాలను జాగ్రత్తగా నిర్మించాలని ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. దీనిపై మెట్రో అధికారులు, జాతీయ రహదారుల సంస్థ ప్రతినిథులు భేటీ అయి చర్చించారు. మెట్రో రెండో దశలో మొత్తం 70 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టాలని సంకల్పించింది. అందులో భాగంగానే తొలుత ఎల్బీనగర్ - హయత్ నగర్‎ను ఎంపిక చేశారు.

హయత్‌నగర్‌ నుంచి నిత్యం ఎంతోమంది నగరంలోని వేర్వేరు ప్రాంతాలు, ఐటీ కారిడార్‌కు రాకపోకలు సాగిస్తుంటారు. రహదారిపై రద్దీ దృష్ట్యా గంటల తరబడి ట్రాఫిక్‌లోనే గడపాల్సి వస్తోంది. మెట్రో రాకతో ప్రయాణం సులభతరం కానుంది. ఐటీ కారిడార్‌ వరకు అనుసంధానం ఏర్పడనుంది. సాధారణంగా హయత్ నగర్ నుంచి మియాపూర్‎కు బస్సులో ప్రయాణించాలంటే రద్దీ ఎక్కువ ఉన్న సమయంలో 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. అదికూడా రెండు బస్సులు మారుతూ ప్రయాణం చేయాలి. ఈ మెట్రో విస్తరిస్తే ఒకసారి హయత్ నగర్ లో ఎక్కితే గంటన్నర వ్యవధిలో మియాపూర్ కు చేరుకునే వెసులుబాటు ఉంటుంది.

Tags:    

Similar News