Hyderabad : మహానగరానికి మహర్దశ!

Update: 2025-03-20 10:00 GMT

తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరానికి మహర్దశ సంతరించుకోనుంది. విస్తరిస్తున్న నగరంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ట్రాఫిక్ రద్దీ కారణంగా నగరవాసులు నిత్యం అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ సిటీలో మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్ క్రమబద్దీకరణలో భాగంగా హెచ్ సిటీ ప్రణాళిక తీసుకొచ్చింది. బడ్జెట్ ప్రసంగంలో ఈ ప్రణాళికకు సంబంధించిన వివరాలను ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్కవెల్లడించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కొత్తగా 31 ఫ్లై ఓవర్లు నిర్మించనున్నట్లు ఆర్థిక మంత్రి భట్టి వెల్లడించారు. అంతేకాకుండా 17 అండర్ పాస్లు కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు వివరించారు. వీటితోపాటు నగరంలోని 10 రహదా రులను విస్తరించి ట్రాఫిక్ క్రమబద్దీకరణ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. రూ.7 వేల 032 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించబోతున్నామని ఈ మేరకు అసెంబ్లీ సభా వేదికగా బడ్జెట్ స్పీచ్ లో వివరించారు. వీటికి తోడు మరో 150 కోట్ల రూపాయలతో హైదరాబాద్ సిటీ సుందరీకరణ పనులు కూడా ప్రారంభించినట్లు వెల్లడించారు. హైదరాబాద్ సిటీ భవిష్యత్ అవసరాలు, రాబోయే రోజుల్లో పెరగనున్న బైక్స్, కార్లు, ఇతర వాహనాల రద్దీకి అనుగుణంగా రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News