Ramakrishna Math : హైదరాబాద్ రామకృష్ణ మఠంలో ఘనంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్..
Ramakrishna Math : హైదరాబాద్ రామకృష్ణ మఠంలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి;
Ramakrishna Math : హైదరాబాద్ రామకృష్ణ మఠంలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. రామకృష్ణ మఠం అధ్యక్షులు బోధమయానంద ఈ సందర్భంగా మాట్లాడుతూ... స్వామి వివేకానంద భారత దేశం కోసం చేసిన సేవలను గుర్తు చేశారు.
భారత ఉజ్వల భవిష్యత్తు కోసం స్వామి వివేకానంద తపించారన్నారు. భారత్ బ్రిటీషర్ల నుండి విముక్తమయి ప్రపంచంలో విశ్వగురువుగా ఎదుగుతుందని స్వామీజీ ముందే ఊహించినట్లు బోధమయానంద చెప్పారు.
మఠంలో జరుగుతున్న ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమానికి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆన్లైన్ ద్వారా హాజరయ్యారు. వివిధ కళాశాలలు, పాఠశాలల నుంచి వందలాది మంది విద్యార్ధులు మఠానికి ఈ సందర్భంగా మఠానికి విచ్చేశారు. ఆగస్టు 11న రామకృష్ణ మఠంలోనే ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ముగింపు కార్యక్రమం నిర్వహిస్తామని స్వామి బోధమయానంద తెలిపారు.