CM Revanth Reddy : ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీతో గ్లోబల్ లీడర్ గా హైదరాబాద్ : సీఎం రేవంత్

Update: 2024-11-23 13:00 GMT

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న ఫోర్త్ సిటీ (ఫ్యూచర్ సిటీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ సిటీ) వంటి కొత్త కార్యక్రమాలతో టెక్నాలజీలో హైదరాబాద్ గ్లోబల్ లీడర్ గా ఎదుగుతోందని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. సాఫ్ట్వేర్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, హెల్త్కేర్, బయో టెక్నాలజీ పరిశ్రమలకు పవర్ హబ్గా హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా గుర్తిం పుపొందిందని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ దేశ ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని, సామాన్యులకు న్యా యం జరిగేలా చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. కామన్వెల్త్ మీడియేషన్ ఆర్బిట్రేషన్ సదస్సు-2024 కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. న్యాయ స్థా నాల్లో భారీ సంఖ్యలో కేసులు పెండింగ్లో ఉండడం న్యాయవ్యవస్థకు సవాల్గా మారిందని తెలిపారు. పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించడానికి, వేగంగా, సమర్థ వంతంగా కేసుల పరిష్కారానికి ప్రత్యా మ్నాయ వ్యవస్థలు అవసరం ఉందని ఆయన అభిప్రా యపడ్డారు. మధ్య వర్తిత్వం, చర్చల ద్వారా వీలైనంత త్వరగా సమస్యలు, వివా దాలను పరిష్కరించు కోవా లని, అలా చేయడం వల్ల వివా దంలో చిక్కుకున్న ఇరు వర్గాలకూ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. కేసులను త్వరితగతిన పరిష్క రించేందుకు కృషి చేస్తున్న ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడి యేషన్ సెంటర్ నిర్వాహకులను అభినందిస్తున్నానని చెప్పారు. 

Tags:    

Similar News