Heavy Rains : మరో 2 రోజులు వర్షాలు.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి
తెలంగాణలో 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గురువారం ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మంతో పాటు కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. శుక్రవారం ఉమ్మడి మెదక్, మహబూబ్‌నగర్‌తో పాటు వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష సూచన ఉన్నట్టు వెల్లడించింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. రాష్ట్రంలోకి కిందిస్థాయి గాలులు ప్రధానంగా పశ్చిమ, వాయువ్య దిశల నుంచి వీస్తున్నట్టు తెలిపింది.