BRS: అమీన్ పూర్ లో మళ్లీ హైడ్రా కూల్చివేతలు

కొనసాగుతున్న హైడ్రా యాక్షన్ ప్లాన్;

Update: 2025-01-28 05:00 GMT

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో హైడ్రా మరోసారి దూకుడు పెంచింది. ఇక్కడ చెరువును కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేసినట్లు హైడ్రాకు ఫిర్యాదులందాయి. దీనిపై విచారణ జరిపిన హైడ్రా.. అక్రమాలను గుర్తించి కూల్చివేతలకు రంగం సిద్ధం చేసింది. గతంలోనూ అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా పలు అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. అమీన్ పూర్ పెద్ద చెరువు వద్ద అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై జరుగుతున్నాయి. ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేపట్టిన హైడ్రా అధికారులు, చెరువును ఆక్రమించుకొని నిర్మాణాలు చేయడాన్ని గుర్తించారు. అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు తేలిన వెంటనే, హైడ్రా కమిషనర్ కూల్చివేతకు ఆదేశాలిచ్చారు. హైడ్రా అధికారులు ఈ కూల్చివేతల సమయంలో ప్రజల సహకారం కోరుతున్నారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న చెరువులను ఆక్రమించి ఇళ్లను కట్టిన వారిపై గట్టిగానే చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే నేడు అమీన్ పూర్ లో మరోసారి హైడ్రా అధికారులు కూల్చివేతలు చేయనున్నారు.

హైడ్రా బోర్డులు: రంగనాథ్‌

అక్రమార్కుల నుంచి ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ స్థలాలు, పార్కుల ప్రదేశాల్లో ‘హైడ్రా’ బోర్డులు ఏర్పాటు చేయాలని కమిషనర్ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. 2024 జులై తర్వాత అనుమ‌తి లేకుండా నిర్మిస్తున్న నిర్మాణాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. స‌ర్వే ఆఫ్ ఇండియా, ఎన్‌ఆర్‌ఎస్‌సీ శాటిలైట్ ఇమేజీల‌తో పాటు గ్రామాల‌కు చెందిన మ్యాప్‌ల‌ను ప‌రిశీలించి ఎఫ్‌టీఎల్ ప‌రిధిని నిర్ధరించాల‌ని రంగనాథ్ చెప్పారు.

సోమవారం 78 ఫిర్యాదులు

హైడ్రా ప్ర‌తి సోమ‌వారం నిర్వ‌హించే ప్ర‌జావాణికి ఫిర్యాదులు కొన‌సాగుతున్నాయి. సోమ‌వారం మొత్తం 78 ఫిర్యాదులు వ‌చ్చాయి. సోమ‌వారం నిర్వ‌హించిన మూడో ప్ర‌జావాణికి.. ఔట‌ర్ రింగురోడ్డు ప‌రిధివ‌ర‌కూ న‌లువైపుల నుంచి ఫిర్యాదు దారులు వ‌చ్చి హైడ్రా క‌మిష‌న‌ర్‌ను క‌లిసి విన‌తి ప‌త్రాలు అంద‌జేశారు.

Tags:    

Similar News