శేరిలింగంపల్లి మండలంలోని ఖాజాగూడ, నానక్ రామ్ గూడ ప్రధాన మార్గానికి ఇరువైపులా ఉన్న తౌతాని కుంట, భగీరథమ్మ చెరువుల ఆక్రమణలతో పరిసర ప్రాంతాలను వరద నీరు ముంచెత్తుతోందని స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని హైడ్రా కమిషనర్ ఏవీ. రంగనాథ్ తెలిపారు. తౌతాని కుంట, భగీరథమ్మ చెరువుల ఆక్రమణల తొలగింపు విషయంలో వస్తున్న విమర్శలకు రంగనాథ్ బుధవారం వాస్తవాలను వివరించారు. ఫిర్యాదుల పరిశీలనకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెవెన్యూ, ఇరి గేషన్ శాఖలకు చెందిన అధికారులతో కలసి తాను స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించానన్నారు. అక్కడే ఉన్న వారిని విచారించినట్టు తెలిపారు. కూల్చివేతలకు సంబంధించిన అంశాన్ని కూడా తెలియజేశారు. తౌతానికుంట, భగీరతమ్మ చెరువులకు ఎనిమిదేళ్ల క్రితమే ఎస్టీఎల్, బఫర్ జోన్లను గుర్తించడానికి ఫ్రిలిమినరీ, ఫైనల్ నోటీఫికేషన్స్ ఫిక్స్ చేశారని రంగ నాథ్ తెలిపారు. దీంతోపాటు గత నెల 28న బుద్దభవన్ లోని హైడ్రా ప్రధాన కార్యాలయంలో వాణిజ్య దుకాణాల ఓనర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్స్, శిఖం పట్టా దార్లతో సమావేశం ఏర్పాటు చేసి ఎస్టిఎల్, బఫర్ జోన్ సరిహద్దులను స్పష్టంగా పేర్కొంటూ తౌతాని కుంట, భగీరథమ్మ చెరువులో జరిగిన ఆక్రమణల గురించి స్క్రీన్ పై గూగుల్ ఎర్త్ స్పష్టంగా హైడ్రా అధికారులు వివరించారని తెలిపారు. అందుకు అందురూ అంగీకరించారని తెలిపారు