సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. అమీన్ పూర్ లో భూకబ్జాలపై, చెరువు ముంపుపై స్థానికులన ుంచి ఫిర్యాదులు చేస్తుండటంతో హైడ్రా కమిషనర్ పర్యటించారు. మున్సిపల్ పరిధిలోని పెద్దచెరువును రంగనాథ్ పరిశీలించారు. చెరువు లోని నీరు తూముల ద్వారా కిందకు వదలకపోవడంతో ఎగువున వున్న తమ నివాసాలు మునిగిపోయాయి అంటూ స్థానికులు ఫిర్యాదు చేశారు.. నిపుణుల కమిటీ వేసి నివేదిక తెప్పించుకుని ప్రభుత్వానికి సమర్పిస్తామన్న కమిషనర్ హామీ ఇచ్చారు. ఇప్పటికే పలు నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది.