HYDRA : కావూరి హిల్స్ ఆక్రమణలపై హైడ్రా ఇనుపహస్తం

Update: 2024-09-23 09:15 GMT

తమ స్పీడుకు బ్రేకుల్లేవంటోంది హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ - హైడ్రా. హైదరాబాద్‌లో అక్రమంగా నిర్మించిన కట్టడాల కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. ఇప్పటికే పలుచోట్ల అక్రమ కట్టడాలను కూల్చివేసిన హైడ్రా.. తాజాగా కావూరి హిల్స్‌లో నిర్మాణాలపై ఫోకస్‌ పెట్టింది. హైడ్రా అధికారులు, పోలీసులు ఉదయమే కావూరి హిల్స్‌కు చేరుకున్నారు. కావూరి హిల్స్‌లో పార్క్‌ను ఆక్రమించి అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు.

పార్క్‌ స్థలంలో స్పోర్ట్స్​ అకాడమీ నిర్మాణంపై కావూరి హిల్స్​ అసోసియేషన్​ హైడ్రాకు ఫిర్యాదు చేసింది. దీంతో అక్రమ నిర్మాణాలను తొలగించి కావూరిహిల్స్​ పార్కు పేరిట బోర్డును ఏర్పాటు చేశారు. అయితే, పార్కు స్థలాన్ని 25 ఏళ్లు లీజుకు తీసుకున్నామని స్పోర్ట్స్​ అకాడమీ నిర్వాహకులు తెలిపారు. గడువు తీరకముందే అన్యాయంగా నిర్మాణాలు తొలగించారని ఆరోపించారు.

స్పోర్ట్స్ ఎకాడమీ, షెడ్ల నిర్వాహకులకు తాము నోటీసులు ఇచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. అధికారుల నోటీసులను జిమ్‌ నిర్వాహకులు పట్టించుకోకపోవడంతో తాజాగా కూల్చివేతలు ప్రారంభించినట్టు చెప్పారు. కోర్టు ఆదేశాలతోనే అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నట్టు హైడ్రా అధికారులు తెలిపారు.

Tags:    

Similar News