అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా ఫిలింనగర్‌లోని సోసైటీ పార్క్ ల్యాండ్‌లో అక్రమ నిర్మాణాలు కూల్చివేసింది. ఫిలింనగర్‌లో కాలనీలో సొసైటీ గత కొన్నేళ్లుగా మహిళా మండలి కోసం షెడ్డును నిర్మించారు. 291 గజాల రోడ్డు స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని..హైడ్రా సిబ్బంది దాన్ని నేలమట్టం చేశారు. ఈ స్థలంలో వెంటనే రోడ్డు వేయాలని ఖైరతాబాద్ జోనల్ కమిషన్ అనురాగ్ జయంతికి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశించారు. రెండు రోజుల్లో రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. మరోవైపు ఈ స్థలంపై చర్యలు తీసుకోవద్దంటూ ఫిల్మింనగర్ సొసైటీ న్యాయ స్థానాన్ని ఆశ్రయించింది. కోర్టు గతేడాది నవంబర్ 10న పర్మినెంట్ స్టే కొనసాగిస్తూ తీర్పునిచ్చింది. కోర్టు స్టే ఉండగానే ఎలా కూల్చివేస్తారంటూ ఫిల్మింనగర్ సొసైటీ కార్యదర్శి కాజా సూర్యనారాయణ ప్రశ్నించారు. తమకు నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేశారని మండిపడ్డారు. ఈ కూల్చివేతలు నిబంధనలకు విరుద్ధమని ఆందోళన వ్యక్తం చేశారు.